శ్రీరంగపూర్

శ్రీరంగపూర్

మహబూబ్ నగర్ జిల్లాలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. 18వ శతాబ్దంలో కట్టిన దేవాలయం ఇది. ఈ చుట్టుపక్కల పేరొందిన పుణ్యస్థలం ఇది. కృష్ణదేవరాయ చక్రవర్తి శ్రీ రంగనాయకస్వామి గుడి కట్టించాలనే తలంపుతో శ్రీరంగం దర్శించినప్పుడు ఆ స్వామి అతనికి కలలో కనపడి తాను ఒకానొక ప్రదేశంలో వెలసి ఉన్నానని ఒక గద్ద ఆ మహారాజును అచటికి చేర్చగలదని చెప్పాడని సమాచారం. దాంతో ఒక గద్ద దారి చూపగా వెళ్లిన ఆ మహారాజుకి కొత్త కరపాకల కొండల నడుమ రంగనాయకస్వామి విగ్రహం కన్పించింది. ఈ గుడిని రత్న పుష్కరిణి సరస్సు తీరాన నిర్మించారు.

Similar Posts

Recent Posts

International

Share it