తలకోన జలపాతం
ఓ వైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలు..మరోవైపు ప్రకృతి పరవళ్ళు చిత్తూరు జిల్లా సొంతం. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో తలకోన జలపాతం ఒకటి. తలకోన శేషాచల కొండల వరుసలో తల బాగంలో ఉండటంతో దీనికి తలకోన అనే పేరు వచ్చింది. ఇక్కడు న్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. 271 అడుగుల ఎత్తునుంచి నీళ్ళు కిందకు పడుతుంటాయి. ఈ జలపాత దృశ్యం చూపరులను కట్టిపడేస్తుంది. ఇక్కడకు చేరుకోగానే మొదట కనపడేది సిద్దేశ్వర,అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్ర హ్మణ్య స్వామి ఆలయాలు. వీటికి దగ్గరలోనే వాగు ఒకటి ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది.
ఇందులోని నీరు చాలా స్వచ్చంగా, చాలా చల్లగా ఉంటుంది. సిద్దేశ్వరాలయం నుండి కొంత ముందుకు సాగితే నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరిలకు వెళ్ళవచ్చు. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహం వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఈ కొలను లోతు ఎవరూ కనుగొనలేదు. అంత సాహసం ఎవరూ చేయలేదు. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశం రెండు కొండల నడుమ ఉండే పెద్ద గుండు రాయి. ఇది ఎప్పడు మీద పడుతుందో అని భయపడక మానరు చూసిన వారు.
తిరుపతికి 45 కి.మీ దూరంలో శేషాచల కొండల పర్వత శ్రేణుల మధ్యలో తలకోన ఉంది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న జలపాతాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఔషధ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి. తలకోనలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ పున్నమి అతిథి గృహం ఉంది.
హరిత హోటల్ నెం. 85842 72425