తాళ్లపాక

తాళ్లపాక

కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామిని 32 వేల కీర్తనలతో ఆరాధించిన పదకవితా పితామహుడు, అన్నమాచార్యుడు తాళ్లపాకలో జన్మించాడు. "చందమామ రావే జాబిల్లి రావే", "అదివో అల్లదివో శ్రీహరివాసము" వంటి కీర్తనలు ఆయన నుండి తెలుగు వారికి దక్కాయి. ఈ తాళ్లపాక గ్రామం వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట మండలంలో ఉంది. క్రీ.శ. 1426వ సంవత్సరం క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున తాళ్లపాకలో అన్నమయ్య జన్మించాడు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య చిన్నప్పుడే తిరుమల చేరుకున్నాడు.

తల్లిదండ్రులు కోరగా తిరిగి తాళ్ళపాకకు వచ్చి వివాహం చేసుకున్నా మళ్లీ తిరుమల వెళ్ళాడు. ఆయన ఇల్లాలు తిమ్మక్క సుభద్రాపరిణయం రచించింది.తెలుగులో ఆమె తొలి కవయిత్రి అని చెబుతారు.తాళ్ళపాకలో చెన్నకేశవాలయం, సుదర్శనాలయం ఉన్నాయి. సుదర్శనాలయంలో సుదర్శన చక్రం ప్రతిష్ఠించి ఉంది. సుదర్శన చక్రం కాశీలో తప్ప మరెక్కడా లేదు.తాళ్లపాకలో సిద్ధేశ్వరాలయం కూడా ఉంది. ఈ ఆలయాలు9, 10 శతాబ్దాల నాటివి. తిరుమల తిరుపతి దేవస్థానం1982లో అన్నమయ్య ఆరాధన మందిరాన్ని నిర్మించి అందులో అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పింది.

కడప – రాజంపేట రహదారిలో రాజంపేటకు సమీపంలో ప్రధాన రహదారి నుండి

తూర్పుగా 3 కి.మీ. దూరంలో తాళ్లపాక గ్రామం ఉంది.

Similar Posts

Recent Posts

International

Share it