తెలంగాణలో తెరుచుకున్న పర్యాటక కేంద్రాలు
పర్యాటకులకు శుభవార్త. ఏడు నెలల విరామం తర్వాత తెలంగాణలో పర్యాటక కేంద్రాలు తెరుచుకున్నాయి. బోటింగ్ సౌకర్యాలు కూడా పర్యాటకులకు అందుబాటులోకి వచ్చాయి. విధిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు ఆదేశించింది. పర్యాటకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో టూరిజం బస్సు సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్ - 2019 నిబంధనల ప్రకారంగా పర్యాటక కేంద్రాల వద్ద ధర్మో స్కానర్స్ ద్వారా పర్యాటకుల టెంపరేచర్ ను పర్యాటక శాఖ సిబ్బంది తనిఖీ చేసిన అనంతరం అనుమతించునున్నారు. పర్యాటక శాఖ సిబ్బంది తప్పనిసరిగా ఫేస్ మాస్క్ తో పాటు చేతి గ్లౌస్ లు ధరించాలని నిబంధనల్లో స్పష్టం చేశారు.
పర్యాటక శాఖ సిబ్బంది తప్పనిసరిగా క్రమం తప్పకుండా హాండ్ శానిటైజర్ ను ఉపయోగించాలన్నారు. అలాగే సందర్శకులు/ పర్యాటకులు ఉపయోగించుకునేందుకు పర్యాటక కేంద్రాల వద్ద పెడల్ బేస్డ్ శానిటైజర్ స్టాండ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. పర్యాటక కేంద్రాల్లో డిజిటల్ ప్రెమెంట్స్, ఆన్ లైన్ టిక్కెట్ బుకింగ్, ఆన్ లైన్ పేమెంట్ లను అనుమతి ఇవ్వటం తో పాటు పర్యాటకులను ఆ దిశగా ప్రోత్సాహించాలని మంత్రి శ్రీనివాసగౌడ్ అధికారులను అధేశించారు. పర్యాటక బస్సు సీట్లలో భౌతిక దూరం పాటించేలా సీట్లు ఏర్పాటు చేయాలని టూర్ అపరేటర్ల ను అదేశించారు.