ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటేన్ రెడీ
పర్యాటకులకు ఎన్నో ప్రత్యేక అనుభూతులు మిగుల్చుతుంది దుబాయ్. ఇప్పుడు దుబాయ్ లో మరో ప్రత్యేక..కొత్త ఆకర్షణ రాబోతోంది. అదే ప్రపంచంలోని అతి పెద్ద ఫాంటేన్. అక్టోబర్ 22 నుంచి ఈ ఫౌంటేన్ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కనుంది. ఈ ఫామ్ ఫౌంటేన్ 14 వేల చదరపు అడుగుల సముద్రపు నీటితో విస్తరించి ఉండబోతుంది. అంతే కాదు ఈ ఫౌంటేన్ దగ్గర ఏకంగా 3000 ఎల్ఈడీ లైట్లు కూడా అమర్చనున్నారు. ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే దుబాయ్ లోని ప్రముఖ లైఫ్ స్టైల్, డైనింగ్ డెస్టినేషన్ ‘పాయింటీ’లో పర్యాటకులకు కనువిందు చేయనుంది.
పర్యాటకులు, రిటైలర్లు, పామ్ జుమెరాహ్ కు చెందిన ప్రజలను ఇది ఆకట్టుకోగలదని భావిస్తున్నట్లు చెబున్నారు. పామ్ ఫౌంటేన్ దుబాయ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా మారటం ఖాయం అని దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్ మెంట్ సీఈవో అహ్మద్ అల్ ఖాజా వెల్లడించారు. రాత్రి ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ ఈ షోలు కొనసాగనున్నాయి. ఈ ఫౌంటేన్ షోల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలకు సంబంధించిన పాటలను కూడా విన్పించనున్నారు.
https://www.youtube.com/watch?v=FdZcFWIQaH8&feature=emb_logo
- Airplane Seat Design Dubai Guinness world record Launch event October 22nd PALMFOUNTAIN video relesed The palm fountain World larget fountain అక్టోబర్ 22న ప్రారంభం గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి దుబాయ్ లో పామ్ ఫౌంటేేన్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటేన్ Airplane Seat Design Dubai Guinness world record Launch event October 22nd PALMFOUNTAIN video relesed The palm fountain World larget fountain అక్టోబర్ 22న ప్రారంభం గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి దుబాయ్ లో పామ్ ఫౌంటేేన్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటేన్