.వరంగల్ కోట

.వరంగల్ కోట

అద్భుతమైన శిల్పకళను చూడాలంటే వరంగల్ కోటను సందర్శించాల్సిందే. అక్కడే మట్టి కోట, రాతికోట.. విభిన్న కట్టడాలను వీక్షించవచ్చు. ప్రస్తుతం రాష్ట్ర చిహ్నంగా మారిన కాకతీయ కళాతోరణాలు కూడా ఈ కోటలోనివే కావటం విశేషం. రాజసం ఉట్టిపడేలా కాకతీయుల నిర్మాణాలు ఉంటాయనటానికి ఈ కళాతోరణం ఓ నిదర్శనం. వరంగల్ దుర్గంగా ప్రసిద్ధి చెందిన ఓరుగల్లు కోట చరిత్ర 13వ శతాబ్దం నాటిది.ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తిచేసింది.

ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం.చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసినది. దీనిని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్నది రాతి కోట. గ్రానైటు రాళ్లతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి.ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైనవి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది

హైదరాబాద్ నుంచి 144 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.రైలు..బస్సు సౌకర్యం ఉంటుంది.

ఓరుగల్లు కోట వరంగల్‌ రైల్వేస్టేషనుకు 2 కి.మీ.దూరంలోనూ, హన్మకొండ నుండి 12 కి.మీ. దూరంలో ఉంటుంది.

సందర్శన వేళలు: ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.00గంటల వరకూ

https://www.youtube.com/watch?v=_3Jjz-CUvBg

Similar Posts

Recent Posts

International

Share it