ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఎక్కడో తెలుసా?!

ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఎక్కడో తెలుసా?!

భారత్ కీర్తికిరిటంలో మరో మైలు రాయి చేరనుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి వచ్చే ఏడాది భారత్ లో అందుబాటులోకి రానుంది. అది కూడా ఎక్కడో తెలుసా?. భూతల స్వర్గంగా పిలుచుకునే జమ్మూ అండ్ కాశ్మీర్ లో. రైసీ జిల్లా చీనాబ్ నదిపై నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు (1178 అడుగులు). స్టీల్ అండ్ కాంక్రీట్ ఆర్చ్ గా ఈ బ్రిడ్జి రానుంది. ఇది 2021లో రెడీ కానుంది. ఆ తర్వాత 2022 నుంచి ఈ వ్యాలీ భారత్ రైల్వే లైన్ కు అనుసంధానం కానుంది.

ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఎత్తు 72 మీటర్లు కాగా, ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు మాత్రమే. కానీ ఈ బ్రిడ్జి ఎత్తు మాత్రం ఏకంగా 359 మీటర్లు ఉండటం విశేషం. 266 కెఎంపీహెచ్ స్పీడ్ తో వెళ్ళేలా ప్రపంచంలో ఎత్తైన ఈ బ్రిడ్జిని డిజైన్ చేశారు. గత ఏడాది కాలంగా ఈ బ్రిడ్జి పనులు ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే కనెక్టివిటి పెరిగి పర్యాటక రంగం మరింత ఊపందుకోలదని భావిస్తున్నారు.

Similar Posts

Recent Posts

International

Share it