‘విలాస విహంగం’ ఏ 380 విమానం ఇదే చివరిది

Update: 2020-06-23 05:25 GMT

విమానయాన చరిత్రలో ఓ సంచలనం ఏ380. ఏ 380 అంటే డబుల్ డెక్కర్ విమానం. అంతే కాదు..విమానయానంలో మరిన్ని విలాసాలను అందుబాటులోకి తెచ్చింది కూడా ఈ జంబో జెట్ అనే చెప్పాలి. ఎందుకంటే విమానంలోనే ఓ ప్రదేశంలో ఓపెన్ బార్ ఉంటుంది. ప్రయాణికులు అందులో కూర్చుని ఎంచక్కా మందు కొట్టొచ్చు. అంతే కాదు..ఎన్నో కొత్త కొత్త విలాసాలకు ఇది కేరాఫ్ అడ్రస్ గా మారింది. పలు ఎయిర్ లైన్స్ ఏ 380 వచ్చిన తర్వాతే ఏకంగా విమానాల్లో ‘డబుల్ బెడ్ రూం’ తరహాలో అపార్ట్ మెంట్ అంటూ ఫ్యామిలీకి దూర ప్రయాణం ఉన్న విమానాల్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గగనయానంలో ఇలాంటి ఎన్నో కొత్త పోకడలకు ఏ 380 వేదిక అయింది. ఇప్పుడు అలాంటి ఏ 380 విమానాల ఉత్పత్తి నిలిచిపోతుంది.

ఫ్రాన్స్ లోని ఎయిర్ బస్ యూనిట్ లో ఈ చివరి సూపర్ జంబో ఏ380ని ఉత్పత్తి చేయనున్నారు. ఇదే ఎయిర్ బస్ ఉత్పత్తి చేస్తే చివరి జంబో విమానం కానుంది. కొన్ని ట్రక్ లు ఈ విమానానికి సంబంధించిన విమాన బాడీ ప్రధాన భాగాలు (fuselage sections) తీసుకెళ్ళాయి. ఈ సందర్భంగా ఆ మార్గమధ్యంలో ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ జంబో విమానానికి వీడ్కోలు పలికారు. ఏ380 అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో బోయింగ్ ఈ భారీ విమానాలకు స్వస్తి పలికింది. ఏ 380లో ఏకంగా 555 సీట్లు సామర్ధ్యం కలిగి ఉంటాయి. 2021 నుంచి ఈ విమానాల ఉత్పత్తి ఆగిపోనుంది. ఈ విమానాలకు అతి పెద్ద కస్టమర్ అయిన ఏమిరేట్స్ డజన్ల సంఖ్యలో ఆర్డర్లను రద్దు చేసుకుంది.

Similar News