అంతర్జాతీయంగా ఇప్పుడిప్పుడే విమాన సర్వీసులకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో కలకలం. దుబాయ్ కు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ ఏమిరేట్స్ ప్రయాణికుల్లో కొంత మందికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలటంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఎమిరేట్స్ పాకిస్తాన్ నుంచి విమాన సర్వీసులను రద్దు చేసింది. పాకిస్తాన్ నుంచి వయా దుబాయ్ మీదుగా హాంకాంగ్ వెళ్లిన విమానంలో పాక్ లో 26 మంది ప్రయాణికులు ఎక్కారు. అయితే ఇందులో కొంత మంది కరోనా పాజిటివ్ అని తేలింది.
తాము కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని..త్వరలోనే సర్వీసులు పునరుద్ధించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ విమానాల్లో ప్రయాణించే వారికి హాంకాంగ్ లో కోవిడ్ 19 ఉన్నట్లు తేలటంతో జూన్ 24 నుంచి పాకిస్తాన్ నుంచి సర్వీసులు నిలిపివేసినట్లు ఎమిరేట్స్ ప్రకటించింది. దుబాయ్ ఇఫ్పటికే జూన్ 23 నుంచి దేశంలో తమ పౌరులు విదేశాలకు వెళ్ళటానికి అనుమతించింది. అదే సమయంలో జులై 7 నుంచి పర్యాటకులను కూడా దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.