అంతర్జాతీయ విమాన సర్వీసుల కోసం భారత్ ఒప్పందాలు

Update: 2020-07-16 13:38 GMT

కరోనాకు ముందు ఉన్నట్లుగా ఇప్పట్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యే ఛాన్సే లేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గకపోవటంతో పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న తరుణంలో కేంద్రం కూడా అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభం అనే అంశాన్ని పక్కన పెట్టింది. కాకపోతే పలు దేశాలతో మాత్రం చర్చలు జరుపుతోంది. ఆయా దేశాల మధ్య మాత్రమే ఎయిర్ బబుల్స్ ఏర్పాటు చేసుకోనున్నారు. అంటే పరిమిత సంఖ్యలోనే ఒప్పందాలు ఉన్న దేశాల మధ్య మాత్రమే విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి.

తొలి దశలో అమెరికా, కెనడాలతోపాటు యూరోపియన్ యూనియన్ దేశాలు అయిన ఫ్రాన్స్, జర్మనీలతోపాటు గల్ఫ్ దేశాలతో ఎయిర్ బబుల్స్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్, జర్మనీ,, అమెరికాలతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఎయిర్ ఫ్రాన్స్ జులై 18 నుంచి ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరుల నుంచి ఫ్రాన్స్ కు 28 సర్వీసులు నడపనుంది. ఆగస్టు 1 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అమెరికాకు కూడా శుక్రవారం నుంచే సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇలా దేశాల మధ్య విడివిడిగా ఒప్పందాలు చేసుకుని సర్వీసులు ప్రారంభించాల్సిందే కానీ..అన్ని రూట్లలో అంతర్జాతీయ సర్వీసులు అనేది ఇఫ్పట్లో సాధ్యమయ్యేలా కన్పించటం లేదు.

Similar News