పాస్ పోర్టు ఉంటే చాలు. పదహారు దేశాలు ఎలాంటి వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఆయా దేశాల పాస్ పోర్టులకు ఉండే ర్యాంక్ లను బట్టి పలు దేశాలకు చెందిన ప్రయాణికులను వీసాలేకుండానే అనుమతి ఇస్తాయి. అయితే భారత పాస్ పోర్టుకు ఈ అవకాశం కల్పించిన దేశాలు పదహారు మాత్రమే. మాల్దీవులు, హాంకాంగ్, మారిషస్, నేపాల్, సెయింట్ విన్సెంట్, సెర్బియా, ట్రినిడాడ్, తోబగో,బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతి, సెనెగల్ తితర దేశాలు ఉన్నాయి. దీంతోపాటు భారత్ కు చెందిన సాధారణ పాస్ పోర్టు కలిగిన వారికి 36 దేశాలు వీసా అన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తున్నాయి.
భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఈ విషయాలను వెల్లడించారు. శ్రీలంక, న్యూజిలాండ్, మలేషియా తదితర దేశాలు ఈ వీసా సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. కేంద్రం ఎలాంటి వీసా అవసరం లేకుండా భారతీయులు ప్రయాణించే వీలుగా పలు దేశాలతో చర్చలు జరుపుతోందని వెల్లడించారు. అంతే కాకుండా వీసా అన్ అరైవల్, ఈ వీసాల సౌకర్యం కూడా కోసం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. అదే జర్మనీ, అమెరికా దేశాల పాస్ పోర్టులు కలిగిన వారు వీసా లేకుండా తిరిగే దేశాల సంఖ్య భారత్ తో పోలిస్తే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది.