తెలంగాణలోని ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాజెక్టు న్యూలుక్ సంతరించుకుంటోంది. ఇక్కడ చేపట్టిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుద్ధుడి జీవిత చరిత్ర అంతా తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 275 ఎకరాల్లో ఇది రూపుదిద్దుకుంటోంది. బౌద్ధారామాలు, ఎకో టూరిజం రిసార్టులు, కాటేజీ సదుపాయాలతో కూడిన ప్రాజెక్టు పనులు చేపట్టారు.
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కు అని తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరువలో ఉండే ఈ బుద్ధిజం ప్రాజెక్టు ఉంటుంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారని అంచనా.