మెరీనా బీచ్ మళ్ళీ కళకళ

Update: 2020-12-16 14:17 GMT

చెన్నయ్ మెరీనా బీచ్ ఎనిమిది నెలల తర్వాత మళ్ళీ మళ్ళీ కళకళలాడుతోంది. తాజాగా బీచ్ లోకి పర్యాటకులను అనుమతిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా ఆంక్షలను సడలిస్తూ పర్యాటక ప్రాంతాలకు గేట్లు తెరుస్తున్న విషయం తెలిసిందే. అయితే బీచ్ లో కూడా ఆయా ప్రాంతాల్లో 50 శాతం పరిమితి మేర మాత్రమే పర్యాటకులను అనుమతించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో గ్రేటర్ చెన్నయ్ కార్పొరేషన్ వెండర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. పారదర్శకంగా షాప్ లు తెరుచుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బీచ్ లోకి పర్యాటకులను అనుమతి ఇవ్వటంతో పెద్ద ఎత్తున సందర్శకులు ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు.

గత కొన్ని నెలలుగా చాలా మంది బయటకు వచ్చే అవకాశం లేకపోవటంతో పూర్తిగా ఇళ్ళలోనే మగ్గిపోయారు. ఇప్పుడు కరోనా కేసుల భయం ఒకింత తగ్గటం, దీనికి తోడు ఆంక్షల సడలింపులు రావటంతో ఊపిరిపీల్చుకుని బయటకు వస్తున్నారు. అయితే ఈ సంఖ్య కూడా ఇంకా పరిమితంగానే ఉంటుంది. దేశంలో కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి మరింత ధీమా వస్తే తప్ప సాధారణ పరిస్థితులు నెలకొనేలా లేవని చెప్పొచ్చు.

Tags:    

Similar News