తొలి సారి క్రూయిజ్ లో మూడేళ్ళ ప్రపంచ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో 135 దేశాలు కవర్ అవుతాయి. ఇది మూడేళ్ళ పాటు సాగనుంది. అయితే ఇందులో ప్రయాణానికి ఏడాదికి కనీస టికెట్ ధర 24 .5 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. అంటే మూడేళ్లు ఇందులో తిరగాలంటే దానికి ఏకంగా 75 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒక్కో వ్యక్తికి మాత్రమే . ఈ క్రూయిజ్ నవంబర్ 1 న ఇస్తాంబుల్ నుంచి బయలుదేరనుంది. 135 దేశాల్లో మొత్తం 375 ప్రాంతాలను ఇది కవర్ చేయనుంది. ఇందులో కరీబియన్ దీవులతో పాటు అంటార్కిటికా, హవాయి, ఆసియా ఉంటాయి. ఈ టికెట్ ధరలో జిమ్, డిన్నర్, లాండ్రీ, హౌస్ కీపింగ్, ఇంటర్నెట్ , ఇతర సర్వీసులు కూడా ఉంటాయి. అంతే కాదు స్విమ్మింగ్ పూల్, 24 గంటలు అందుబాటులో ఉండే హాస్పిటల్,ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రూయిజ్ లో 1074 మంది ప్రయాణికులు పట్టేలా 400 కేబిన్స్ ఉంటాయి.