శంషాబాద్ లో ఈ బోర్డింగ్ సేవలు ప్రారంభించిన ఎమిరేట్స్

Update: 2021-02-23 04:46 GMT

జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి ప్రయాణికులకు ఈ బోర్డింగ్ సేవలు అందబాటులోకి తెచ్చింది. దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఇండిగో, గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ షెడ్యూల్డ్ అంతర్జాతీయ క్యారియర్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పేపర్‌లెస్ ఈ బోర్డింగ్‌తో అనుసంధానమయ్యాయి. తాజాగా ఎమిరేట్స్ ఈ జాబితాలో చేరింది. దుబాయికి వెళ్లే ప్రయాణీకులు, EK 527 విమానంలో ఎక్కడానికి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ దీనిని ఉపయోగించుకుంది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని దేశీయ విమానాల ప్రయాణికులకూ మొదటి నుంచి చివరి వరకు పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్‌ను అందించిన మొదటి, ఏకైక విమానాశ్రయంగా ఘనత పొందింది.

ఈ-బోర్డింగ్ వ్యవస్థను ఉపయోగించడానికి ప్రయాణీకులు సంప్రదాయ పేపర్ బోర్డింగ్ పాసులు లేదా తమ మొబైల్ ఫోన్లలో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్‌లను రెండూ ఉపయోగించుకోవచ్చు. అంతర్జాతీయ ఈ-బోర్డింగ్ వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు - మెరుగైన ప్రయాణీకుల అనుభవం, విమానాశ్రయంలో క్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గించడం, చెక్ పాయింట్ల వద్ద పునరావృతాలను తొలగించడం, విమానయాన సంస్థలు తమ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. అన్ని ప్రయాణీకుల చెక్ పాయింట్ల రియల్ టైమ్ డేటా లభ్యత వల్ల విమానాశ్రయ కార్యాచరణ సామర్థ్యం మెరుగై, విమానాశ్రయం యొక్క భద్రతను పెంచడంలో సహాయపడుతుందని తెలిపారు.

Tags:    

Similar News