ఆ విమానంలో అంతా వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందే

Update: 2021-02-21 15:50 GMT

ఎమిరేట్స్ మరో రికార్డు

ప్రపంచంలో ఈ ఘటన సాధించిన తొలి ఎయిర్ లైన్స్ ఇదే

ప్రపంచంలోనే ఈ ఫీట్ సాధించిన తొలి ఎయిర్ లైన్స్ గా ఎమిరేట్స్ నిలిచింది. దుబాయ్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్ళే ఎమిరేట్స్ విమానం ఈ కొత్త రికార్డు సృష్టించింది. పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందితో ఆదివారం నాడు ఈ విమాన సర్వీసును నడిపారు. ఫ్రంట్ లైన్ సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా తమ విమానంలో ప్రయాణించే వారికి మరింత సురక్షితమైన భావన కల్పించినట్లు ఎమిరేట్స్ వెల్లడించింది. ప్రతి టచ్ పాయింట్ లోనూ వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే నియమించారు.

బిజినెస్, ఫస్ట్ క్లాస్ తోపాటు బోర్డింగ్ గేట్ సిబ్బంది, ఇంజనీర్లు, పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. ఒక నెల రోజుల వ్యవధిలోనే యూఏఈలో 26 వేల మందికి కోవిడ్ 19కి సంబంధించి రెండు డోసుల వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. తాము ఆరోగ్య, రక్షణకు సంబంధించి ఎంత ప్రాధాన్యత ఇస్తామో తమ పనితీరు నిరూపిస్తోందని పేర్కొంది. దీని ద్వారా ఎమిరేట్స్ విమానాల ద్వారా ప్రయాణించేవారికి తమ చర్యల ద్వారా అదనపు రక్షణ కల్పించినట్లు అవుతుందని వెల్లడించారు.

Tags:    

Similar News