గోవాలో క్యాసినోల సందడి షురూ

Update: 2020-11-02 04:27 GMT

గోవా అంటే గుర్తొచ్చేది బీచ్ లు. క్యాసినోలు. నైట్ లైఫ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది దేశ బీచ్ ల రాజధాని. ఒక్క యూతే కాదు..పర్యాటక ప్రేమికులు అందరూ గోవా బాట పడతారు. ఏడాదికి ఒక సారి అయినా గోవా వెళ్లొచ్చే వారు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారత్ లో క్యాసిన్ లు ఉన్న ఏకైక ప్రాంతం కూడా గోవానే కావటం విశేషం. ఇప్పుడు అక్కడ క్యాసినోల సందడి మొదలైంది. నవంబర్ 1 నుంచే క్యాసినోల ప్రారంభోత్సవానికి అనుమతించింది సర్కారు. అయితే 50 శాతం పరిమితితోనే క్యాసినోలు ప్రారంభించటానికి అనుమతి మంజూరు చేశారు. వాస్తవానికి గోవా గత కొన్ని రోజులుగా పర్యాటకులను ఎలాంటి ఆ:క్ష్లు లు లేకుండానే అనుమతిస్తోంది. తాజాగా క్యాసినోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇఛ్చారు. మండోవి నదిలో గోవా సర్కారు మొత్తం ఆరు ఆఫ్ షోర్ క్యాసినోలకు అనుమతి ఇచ్చింది. ఇందులో ఫైవ్ స్టార్ స్థాయి క్యాసినోలో కూడా ఉన్నాయి. అందులో సందడి ఓ రేంజ్ లో ఉంటుంది.

సహజంగా గోవా పర్యాటక రంగానికి సంబంధించి ఇది పీక్ సీజన్. అక్టోబర్ నుంచి ప్రారంభం అయి ఫిబ్రవరి వరకూ పెద్ద ఎత్తున గోవాకు పర్యాటకులు తరలివస్తారు. ఇందులో దేశీయ, విదేశీ పర్యాటకులు ఉంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ 19 కారణంగా గోవా పర్యాటక కూడా దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పుడిప్పుడే అది గాడిన పడుతోంది. తిరిగి ఈ రంగాన్ని గాడిపెట్టేందుకు ప్రభుత్వం క్యాసినోలకు అనుమతి ఇవ్వటంతో బీచ్ ల పక్క వెదురుతో కట్టే నివాస ప్రాంతాలకు అనుమతి ఇఛ్చారు. పర్యాటకుల్లో వీటిల్లో ఉండేందుకు చాలా ఇష్టపడతారు. గోవాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గోవాలో మొత్తం 43,416 కరోనా నమోదు కాగా, అందులో 40,409 మంది కోలుకున్నారు. గోవాలో కరోనా రికవరి రేటు 93.07 శాతంగా ఉంది. ప్రస్తుతం గోవాలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 2500 లోపు మాత్రమే.

Tags:    

Similar News