మధ్యప్రదేశ్ లో ని చారిత్రక పట్టణాలైన గ్వాలియర్, ఆర్చాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ నగరాల జాబితాలో వీటికి చోటు దక్కింది. ఈ గుర్తింపుతో ఆయా నగరాలకు అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా ప్రత్యేక గుర్తింపు లభించినట్లు అయిందని ప్రభుత్వం పేర్కొంది. అర్భన్ ల్యాండ్ స్కేప్ సిటీ కార్యక్రమంలో భాగంగా వీటికి ఈ గుర్తింపు లభించింది.
యునెస్కో వారసత్వ నగరాల జాబితాలో చోటు దక్కటంతో గ్వాలియర్, ఆర్చాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది యునెస్కో బృందం ఆయా నగరాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించనుంది. గ్వాలియర్ లోని కోటలు, దేవాలయాలతో రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. ఆర్చాలోని మహళ్ళు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.