హైదరాబాద్-హుబ్లీ విమాన సర్వీసులు పునరుద్ధరణ

Update: 2021-03-31 08:00 GMT

జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఐఏఎల్) నుంచి బుధవారం నాడు హైదరాబాద్-హుబ్లి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అలయన్స్ ఎయిర్ ఈ సర్వీసులను పునరుద్ధరించింది. విమానాశ్రయ అధికారులు, ఇతర భాగస్వాముల సమక్షంలో అలయెన్స్ ఎయిర్ విమానం హైదరాబాద్ నుండి ఉదయం 06.35 గంటలకు బయలుదేరింది. ఈ సర్వీసుతో హైదరాబాద్ నుండి దేశీయ గమ్యస్థానాల సంఖ్య 57 కి చేరుకుంది. అలయెన్స్ ఎయిర్ ఈ సెక్టార్‌కు 70 సీట్ల ATR 72 600 ని కేటాయించింది. ఫ్లైట్ నెంబర్ 9I 879 హైదరాబాద్ నుండి 06.25 గంటలకు బయలుదేరి హుబ్లికి 08.00 గంటలకు చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ నెంబర్ 9I 880 హుబ్లి నుండి 08.25 గంటలకు బయలుదేరి 09.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ విమాన సర్వీసు వారానికి మూడుసార్లు - సోమవారం, బుధవారం మరియు శుక్రవారం నడుస్తుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సన్నద్ధంగా ఉంది. టైర్-2, టైర్-3 నగరాలకు విమాన కనెక్టివిటీని పెంచడానికి భారత ప్రభుత్వం ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ఉడాన్ కింద ప్రారంభించిన ఈ సేవలు మెట్రోలతో కనెక్టివిటీని తిరిగి స్థాపించడంలో చాలా కీలకమైనవి. హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారంలాంటిది.

Tags:    

Similar News