భారత పర్యాటకులకు 'నో చెప్పిన' మాల్దీవులు

Update: 2021-04-26 07:53 GMT

కరోనా సమయంలో దేశంలోని సెలబ్రిటీలు, సంపన్నులు అంతా 'మాల్దీవుల' బాట పట్టారు. అంతే కాదు..అక్కడకు వెళ్లి అందమైన సముద్ర రిసార్ట్స్ ల్లో సేదతీరుతూ ఈ ఫోటో లను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసుకున్నారు. ఇటీవల వరకూ ఈ ట్రెండ్ సాగింది. ఇప్పుడు సెలబ్రిటీలు, సంపన్నులకు మాల్దీవులు బిగ్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 27 నుంచి భారత్ కు చెందిన పర్యాటకులను అనుమతించబోమని తేల్చిచెప్పింది. తమ పర్యాటక ప్రాంతాలను సురక్షితమైన ప్రాంతాలుగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

గత కొన్ని నెలలుగా మాల్దీవులకు వెళ్లిన వారిలో అత్యధికులు భారతీయులే ఉన్నారు. కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది మాల్దీవులకు వెళ్లి అక్కడ చాలా రోజులు ఎంజాయ్ చేసి వచ్చారు. కానీ ఇప్పుడు కరోనా రెండవ దశ దేశాన్ని వణికిస్తుండటంతో పలు దేశాలు భారత్ పై నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు మాల్దీవులు కూడా చేరింది. ఇప్పటికే యూకె, యూఏఈ, కెనడా, ఒమన్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కువైట్, సింగపూర్ వంటి దేశాలు బారతీయులపై నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.

Tags:    

Similar News