వీసా లేకుండా ఒమన్ వెళ్లొచ్చు

Update: 2020-12-11 04:35 GMT

అరబ్ ప్రపంచంలో స్వతంత్ర దేశం ఒమన్. ఆ అరబ్ దేశం వీసా లేకుండా పర్యాటకులను అనుమతిస్తోంది ఇప్పుడు. భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా 103 దేశాలకు ఈ అవకాశం కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ దేశీయ ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వీసా లేకుండా చేసే ఈ పర్యటనలను పది రోజులకు మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు ఆ పది రోజులకు గాను హోటల్ బుకింగ్, రిటర్న్ ఫ్లైట్ టిక్కెట్ తో ఆరోగ్య బీమాను విమానాశ్రయంలో చూపించాల్సి ఉంటుంది.

వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించే ప్రతి దేశం ఇదే పద్దతిని అనురిస్తుందనే విషయం తెలిసిందే. హోటల్స్, పర్యాటక సంస్థలు కల్పించే టూర్లకు వీసాలు ఇవ్వటానికి ఒమన్ రెడీ అయింది. అక్టోబర్ ఒకటి నుంచే ఒమన్ కు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఒమన్ రాజధాని మస్కట్ లో ఎన్నో అందమైన బీచ్ లతోపాటు పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలు ఈ ప్రాంతం సొంతం. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ)కు చెందిన దుబాయ్ కూడా కొద్ది నెలల క్రితమే పర్యాటకులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే దుబాయ్ పర్యాటకం ఊపందుకుంటోంది. అంతే కాదు..ఈ నెల 26 నుంచి ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దుబాయ్ షాపింగ్ పెస్టివల్ కు రెడీ అయిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News