'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' వద్ద సీప్లేన్ సర్వీసెస్

Update: 2020-10-26 04:43 GMT

ప్రతిష్టాత్మకమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద మరో ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ ప్రాంతం దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారింది. కాకపోతే కరోనా కారణంగా దేశంలో అన్ని చోట్ల పర్యాటక కార్యకలాపాలు మందగించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నుంచి స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్దకు సీ ప్లేన్ సర్వీస్ లు ప్రారంభం కానున్నాయి. ఈ సేవలు అక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు ఎనిమిది సర్వీసులను నడపనున్నారు. ఒక్కో టిక్కెట్ ధరను 4800 రూపాయలుగా నిర్ణయించారు. ఈ సర్వీసుల కోసం ఇప్పటికే మాల్దీవుల నుంచి ప్రత్యేక విమానాలు భారత్ చేరుకున్నాయి. స్పైస్ జెట్ ఈ సర్వీసులు నిర్వహించనుంది.

15 సీట్లతో కూడిన డీహెచ్ సీ విమానాలను ఈ సర్వీసుల కోసం వాడనున్నారు. మాల్దీవులకు చెందిన మాల్దీవియన్ ఏరో ఈ విమానాలు సరఫరా చేస్తోంది. ఆదివారం నాడు మాలే నుంచి బయలుదేరి ఈ విమానాలు కొచ్చి, గోవాల్లో ల్యాండ్ అయి గుజరాత్ చేరుకోనున్నాయి. మాల్దీవియన్ ఏరో సహకారంతో సీ ప్లేన్ సర్వీసుల ప్రారంభం కానున్నాయి. దేశంలో ఆరు వాటర్ ఎయిర్ పోర్ట్స్ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అందులో గౌహతి రివర్ ఫ్రంట్, నాగార్జున సాగర్, శతృంజయ డ్యామ్, ఉమ్రాంగ్సో రిజర్వాయర్ లు ఉన్నాయి. తొలి రౌండ్ లో మాత్రం సబర్మతి రివర్ నుంచి స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరకూ నడపనున్నారు.

Tags:    

Similar News