పర్యాటకులు.. వివిధ రంగాల్లో నిపుణులైన ఉద్యోగులకు శుభవార్త. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ) వీసా విధానంలో కీలక మార్పులు రానున్నాయి. యూఏఈ కేబినెట్ నిర్ణయం ప్రకారం అన్ని దేశాలకు ఇక బహుళ ప్రవేశ పర్యాటక వీసాలు (మల్టిపుల్ టూరిస్ట్ ఎంట్రీ వీసాలు) జారీ చేయనున్నారు. వీటి కాలపరిమితి 90 రోజులు ఉంటుంది. ఎమిరేట్స్ లో పర్యాటక రంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ఇది దోహదం చేయగలదని భావిస్తున్నారు. ఈ తొంభై రోజుల వ్యవధిలో యూఏఈ పరిధిలోని దేశాల్లో ఎన్నిసార్లు అయినా పర్యటించవచ్చు. అయితే 90 రోజుల కాలపరిమితి తీరిన తర్వాత మాత్రం అనుమతించరు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం యూఏఈ వీసా తొలుత 30 రోజులకు మాత్రమే ఇస్తారు. అయితే ఇది సింగిల్ ఎంట్రీనా లేక మల్టిపుల్ ఎంట్రీనా అన్న అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
కొత్తగా చేసిన మార్పుల ప్రకారం 90 రోజుల గడువుతో ఎన్నిసార్లు అయినా రాకపోకలు సాగించేలా వీసాలు జారీ చేయనున్నారు. దీంతో పాటు దుబాయ్ కేబినెట్ వర్చువల్ వీసాలకు కూడా ఆమోదం తెలిపింది. యూఏఈలో ఆఫీసు ఎక్కడ ఉన్నా దుబాయ్ నుంచి ఆన్ లైన్ లో పనిచేయటానికి అనుమతించనున్నారు. తాజాగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అధ్యక్ష్యతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పర్యాటకులతోపాటు వివిధ రకాల పనులు చేసే వారికి యూఏఈని కీలక ప్రాంతంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.