కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుని యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యూఏఈ) భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని పొడిగించింది. వాస్తవానికి జులై 6 వరకూ నిషేధం ఉంటుందని తొలుత ప్రకటించారు. ఇప్పుడు అయితే తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జీసీఏఏ) తెలిపింది.
భారత్ లో పరిస్థితిని మదింపు చేస్తున్నామని..భాగస్వాముల అందరి భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకూ అయితే భారత్ నుంచి యూఏఈకు ప్రయాణికులను అనుమతించే విషయంలో ఎలాంటి మార్పులు లేవన్నారు. అయితే ఇరు దేశాలు కూడా జులై 6 తర్వాత సర్వీసులు ప్రారంభించే దిశగా చర్చలు సాగిస్తున్నాయని..అయితే అప్పటి పరిస్థితులపైనే ఇది ఆధారపడి ఉంటుందని తెలిపారు.