దుబాయ్ మరో 'ప్రపంచ రికార్డు'ను సాధించింది. ప్రస్తుతం ఆ దేశంలోనే ప్రపంచంలో ఎత్తైన 'స్వింగ్ రైడ్' ఉంది. దుబాయ్ లోని బాలీవుడ్ పార్క్స్ లో దీన్ని ఏర్పాటు చేశారు. 140 మీటర్ల ఎత్తులో (460 అడుగులు) ఈ బాలీవుడ్ స్కైప్లయర్ ను ఏర్పాటు చేశారు. గిజాలోని గ్రేట్ పరిమిడ్ కూడా ఇంతే ఎత్తులో ఉంటుంది. పర్యాటకులకు ఇది నూతన అనుభూతిని ఇవ్వనుందని తెలిపారు. పెద్దలు, పిల్లలకు ఇది ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని బాలీవుడ్ పార్క్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.
వివిధ రకాల వేగపరిమితులతో ఇది పైకి వెళ్ళటంతోపాటు తిరగటం, కిందకు జారటం చేస్తుందని తెలిపారు. వాస్తవానికి ఇప్పటి వరకూ ఓర్లాండో స్టార్ ఫ్లయర్ ప్రపంచంలోనే ఎత్తైన స్వింగ్ రైడ్ ఉంది. ఇప్పుడు దీన్ని దుబాయ్ లోని బాలీవుడ్ పార్క్స్ లో ఏర్పాటుచేసిన బాలీవుడ్ స్కై ప్లయర్ దీన్ని అధిగమించింది. బాలీవుడ్ పార్క్స్ లో పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో షోలు ఉంటాయి.