ఎట్టకేలకు నాన్ ఏసీ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. ప్రస్తుతం కేవలం ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్న సంగతి తెలిసిందే. నాలగవ విడత లాక్ డౌన్ చివరి రోజు మే 31 అన్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా 200 నాన్ ఏసీ రైళ్లను ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అయితే ఈ రైళ్లలో టిక్కెట్లు ఆన్ లైన్ లో నే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేషన్లలో బుకింగ్ కౌంటర్లను ఇప్పట్లో ఓపెన్ చేసే ఆలోచనలేదని రైల్వే శాఖ ప్రకటించింది.
ఈ రైళ్ళ షెడ్యూల్ ను కూడా త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం దేశంలో 15 రూట్లలో ప్రత్యేక రైళ్ళు నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్ళు నడుపుతున్న విషయం తెలిసిందే. దశల వారీగా ప్రయాణికకుల రైళ్ల సర్వీసుల సంఖ్యను పెంచనున్నారు.