గోల్కొండ..చార్మినార్ ల్లో పర్యాటకులకు అనుమతి

Update: 2020-07-05 04:53 GMT

పర్యాటకులకు శుభవార్త. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన చారిత్రక ప్రదేశాలు అయిన గోల్కొండ, చార్మినార్ ల్లో జులై 6 నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. అయితే ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికే మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. పర్యాటకులు కోవిడ్ 19 నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్ణయం మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏఎస్ఐ ఇప్పటికే దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన తాజ్ మహల్ తోపాటు, ఎర్రకోట వంటి చోట్ల పర్యాటకులను అమతిస్తోంది.

సోమవారం నుంచే పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఏఎస్ఐ పరిధిలో ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాల్లో పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించారు. అన్ లాక్ 2లో భాగంగా ఈ మినహాయింపులు కల్పిస్తున్నారు. అయితే ప్రతి చోటా విధిగా మాస్క్ లు ధరించి ఆయా ప్రాంతాలను సందర్శించాలనే నిబంధన పెట్టారు. ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ చార్మినార్ లో సందర్శకులను అనుమతిస్తారు.

https://www.youtube.com/watch?v=28AepinYzoI

Similar News